అన్నమయ్య: కురబలకోట మండలం అంగళ్లు సమీపంలోని మిట్స్ కళాశాలకు దిల్ రూబా చిత్రం హీరో కిరణ్ అబ్బవరం రేపు రానున్నట్లు కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్: రామనాథన్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం కళాశాల నందు ఆయన మాట్లాడుతూ.. దిల్ రూబా చిత్రం యొక్క పాటల ఆవిష్కరణ మిట్స్ కళాశాల నందు జరుగుతాయన్నారు. ఆయనతోపాటు ఆ చిత్రం యొక్క హీరోయిన్లు రానున్నట్లు వెల్లడించారు.