HYD: సంక్రాంతి పండగ నేపథ్యంలో హైదరాబాద్ వాసులంతా సోంతూళ్లకు వెళ్లారు. దీంతో నగరంలో వాయు కాలుష్యం తగ్గుముఖం పట్టింది. ముఖ్యంగా నివాస వాణిజ్య ప్రాంతాల్లో కాలుష్య కారకాలు గణనీయంగా తగ్గిపోగా… పారిశ్రామిక వాడల్లో మాత్రం కాస్త అధికంగా నమోదైంది. ఈ నేపథ్యంలో సంక్రాంతి పండుగ ముగియడంతో మళ్లీ హైదరాబాదులో కాలుష్యం గణనీయంగా పెరిగిపోతుందని అధికారులు పేర్కొన్నారు.