HYD: అభివృద్ధి పనులపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎంఐఎం ఎమ్మెల్సీ మిర్జా రేహమత్ బేగ్ అన్నారు. శుక్రవారం చార్మినార్ జోనల్ కమిషనర్ వెంకన్న, టౌన్ ప్లానింగ్ అధికారులతో ఎమ్మెల్సీ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా చార్మినార్ పరిధిలోని అభివృద్ధి పనులు, సమస్యలపై చర్చించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యా దులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ఉండాలని ఎమ్మెల్సీ సూచించారు.