కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యేపై కూడా కేసు నమోదైంది. 2017లో ఓ నిరసనలో భాగంగా నవ్సారి అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కార్యాలయంలోకి వెళ్లి టేబుల్‌పై ఉన్న ప్రధాని మోదీ(pm modI) ఫోటోను(photo) చింపిన కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే(congress mla) అనంత్ పటేల్(Anant Patel) దోషిగా తేలారు. అంతేకాదు అతనితోపాటు నేరారోపణకు పాల్పడిన ముగ్గురిని కూడా కోర్టు దోషులుగా నిర్ధారించింది.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(rahul gandhi) పార్లమెంటు సభ్యత్వాన్ని కోల్పోయిన విషయం ఇంకా మరువక ముందే మరో కాంగ్రెస్ ఎమ్మెల్యేపై కేసు నమోదైంది. ప్రధాని మోదీ ఫొటో చింపేసినందుకు గాను రూ.99 జరిమానా విధించారు. ఇక వివరాల్లోకి వెళితే 2017లో నవ్ సారి వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఛాంబర్లోకి విద్యార్థులతోపాటు వాన్సాడా నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే(congress mla) అనంత్ పటేల్(Anant Patel) కూడా వెళ్లి నిరసన తెలిపారు. ఆ క్రమంలో వైస్ ఛాన్సలర్ ఛాంబర్లో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) చిత్రపటాన్ని(photo) ఆయన చింపివేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ క్రమంలో ఎమ్మెల్యేతోపాటు మరొ ఆరుగురిపై కూడా 2017 మేలో పోలీసులు కేసు(police case) నమోదు చేశారు.
ఇటీవల ఆ కేసుకు(case) సంబంధించి గుజరాత్(gujarat)లోని నవ్సారి కోర్టు(Navsari court) అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ VA ధధల్ భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 447 ప్రకారం ఎమ్మెల్యే అనంత్ పటేల్‌ను దోషిగా నిర్ధారించి, అతనికి జరిమానా(fine) విధించింది. మే 2017లో అనంత్ పటేల్, యూత్ కాంగ్రెస్ సభ్యులతో సహా మరో ఆరుగురిపై జలాల్పూర్ పోలీసులు(police) పలు సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు.
అనంత్ పటేల్, ఇతరులు నవ్సారి వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ కార్యాలయంలోకి(office) ప్రవేశించి, వికృతంగా ప్రవర్తించారని తేలింది. విద్యార్థుల నిరసన(protest)లో VC టేబుల్‌పై ఉంచిన ప్రధాని మోడీ చిత్రాన్ని చింపివేశారని గుజరాత్‌లోని నవ్సారి కోర్టు(Navsari court) వెల్లడించింది. నేరారోపణకు పాల్పడిన ముగ్గురు నిందితులను కోర్టు దోషులుగా గుర్తించి, రూ.99 జరిమానాను డిపాజిట్ చేయాలని ఆదేశించింది. జరిమానా చెల్లించని పక్షంలో ఏడు రోజుల సాధారణ జైలు(jail) శిక్ష అనుభవించాలని స్పష్టం చేసింది.