»Janhvi Kapoor Sister Anshula Kapoor In Love With Her Boy Friend Rohan Thakkar Celebrities Wishes
love: లవ్ లో ఉన్న జాన్వీ కపూర్ సోదరి..పిక్స్ వైరల్
బాలీవుడ్ చిత్రనిర్మాత బోనీ కపూర్(Boney Kapoor) కుమార్తె, అర్జున్ కపూర్(arjun kapoor).. సోదరి అన్షులా కపూర్(Anshula Kapoor) యాక్టర్ కాకపోయినప్పటికీ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అన్షులా ఇటీవల తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో తన చిత్రాలను పంచుకుని ప్రేమలో ఉన్నట్లు వెల్లడించింది. ఆమె స్క్రీన్ రైటర్ రోహన్ థక్కర్(Rohan Thakkar)తో రిలేషన్లో ఉన్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ఒక రొమాంటిక్ ఫోటోను షేర్ చేసి ప్రకటించింది.
ప్రముఖ బాలీవుడ్ చిత్రనిర్మాత బోనీ కపూర్(Boney Kapoor) కుమార్తె, అర్జున్ కపూర్(arjun kapoor) సోదరి.. అన్షులా కపూర్(Anshula Kapoor) ప్రేమలో పడింది. గత కొన్ని రోజులుగా తన ప్రియుడు స్క్రీన్ రైటర్ రోహన్ ఠక్కర్తో డేటింగ్ చేస్తుంది. ఈ క్రమంలో నిన్న ఆమె రోహన్(Rohan Thakkar)తో తన సంబంధాన్ని అధికారికంగా ప్రకటించింది. తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో అన్షులా తన బాయ్‌ఫ్రెండ్‌తో ఉన్న చిత్రాన్ని పోస్ట్ చేసి వెల్లడించింది.
ఆ ఫొటోలో నీటిలో ఉన్న ఇద్దరు దగ్గరగా ఉండి ఒకరిని ఒకరు పట్టుకుని వారి కళ్ళలోకి ఒకరికొకరు చూసుకుంటూ నవ్వుతుండటం చూడవచ్చు. అంతేకాదు ఈ అమ్మడు “366” అనే శీర్షికలో పెట్టి లవ్ ఏమోజీ పెట్టి పోస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో ఈ జంట ప్రేమ వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి మాల్దీవుల్లో ఉన్నట్లు వెల్లడించింది.
అన్షులా ఫోటోను పోస్ట్ చేసిన వెంటనే ఆమె కుటుంబ సభ్యులు(family) జాన్వీ కపూర్(Janhvi Kapoor), అర్జున్ కపూర్(arjun kapoor), ఖుషీ కపూర్, రియా కపూర్, మహీప్ కపూర్ కామెంట్స్ చేశారు. రెడ్ హార్ట్ ఎమోజీలను వదిలి శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే వీరిద్దరి త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబుతున్నట్లు తెలుస్తోంది.
బోనీ కపూర్(Boney Kapoor), దివంగత టెలివిజన్ నిర్మాత మోనా శౌరీల చిన్న కుమార్తె అన్షులా, ఈమె సోదరుడు అర్జున్ కపూర్. మోనా మరణించిన తర్వాత బోనీ కపూర్ శ్రీదేవిని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత శ్రీదేవికి జాన్వీ(Janhvi Kapoor), ఖుషీ కపూర్ అనే ఇద్దరు అమ్మాయిలు జన్మించారు. అయితే వారు తరచుగా కలిసి ఉల్లాసంగా ఉంటారని తెలుస్తోంది.
మరోవైపు, రోహన్ ఠక్కర్(Rohan Thakkar) ఒక స్క్రీన్ రైటర్. అతను ది నవలా రచయిత అనే షార్ట్ ఫిల్మ్‌కి స్క్రీన్ ప్లే రాశాడు. అతను పూణేలోని ఫ్లేమ్స్ విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రుడయ్యాడు. దీంతోపాటు న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ, లాస్ ఏంజెల్స్‌లో కూడా స్క్రీన్ రైటింగ్‌లో మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చదివాడు.