ELR: కుటుంబ కలహాల నేపథ్యంలో తల్లిపై కొడుకు గొడ్డలితో దాడి చేసిన ఘటన శుక్రవారం ఏలూరులో చోటుచేసుకుంది. తీవ్ర గాయాల పాలైన బాధితురాలిని చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. అలాగే బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.