TG: యాదాద్రి జిల్లా మోత్కూర్ మండలం కొండగడపలో విషాదం చోటుచేసుకుంది. షిరిడీ రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు కొండగడప వాసులుగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.