మంచిర్యాల: చిన్న చిన్న కారణాలకే దంపతుల మధ్య మనస్పర్థలు పెరిగి గొడవలకు దారి తీస్తున్నాయని మంచిర్యాల మహిళా పోలీస్ స్టేషన్ CI నరేష్ అన్నారు. గురువారం మాట్లాడుతూ.. పలు సమస్యలతో దంపతుల మధ్య సఖ్యత తగ్గి పోలీస్ స్టేషన్ వస్తున్నారన్నారు. దీంతో ఇరు కుటుంబాలతో మాట్లాడి కౌన్సెలింగ్ ఇస్తూ చాలామందిలో మార్పు తీసుకొస్తున్నామన్నారు. అయినా కొందరు కోర్టు దాకా వెళ్తున్నారన్నారు.