HYD: నగరంలోని కేబీహెచ్బీలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ మేరకు వివరాల ప్రకారం.. ఓ టిఫిన్ సెంటర్లో మంటలు చెలరేగినట్లు పలువురు తెలిపారు. ఈ ప్రమాదంలో రెండు బైకులు, ఫర్నిచర్ దగ్ధమయ్యాయి. అనంతరం సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.