SKLM: సమీకృత కలెక్టరేట్ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. పార్కింగ్, సెక్యూరిటీ, ప్రహరీ నిర్మాణాలకు సంబంధించి ఆరా తీశారు. ఫిబ్రవరి నెలాఖరు నాటికి భవనాన్ని అప్పగించాలని, నాణ్యత విషయంలో రాజీ లేకుండా చూడాలని ఆర్ అండ్ బీ ఎస్ఈ జాన్ సుధాకర్‌కు సూచించారు. వీలైనంత త్వరగా పనులను పూర్తి చేయాలన్నారు.