MDK: నడుచుకుంటూ వెళ్తున్నా వృద్ధురాలిని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన మూసాయిపేట మండలంలో జరిగింది. స్థానికుల వివరాలు.. మృతురాలు మండలంలోని హక్కింపేట్ గ్రామానికి చెందిన పత్తి కృష్ణమ్మ (80) గా గుర్తించారు. మేడ్చల్లో ఉంటున్న తన కూతురు వద్దకు వెళుతున్న క్రమంలో సర్వీస్ రోడ్డులో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో మృతి చెందింది.