కృష్ణా: కంచికచర్ల పట్టణంలో వీధి కుక్కల బెడద అధికంగా ఉందని స్థానిక ప్రజలు వాపోయారు. కుక్కలు గుంపులుగా స్వైర విహారం చేస్తున్నాయని, చిన్నారులను బయటకు పంపించాలంటే భయపడాల్సి వస్తుందని ఆవేదన చెందారు. రాత్రి సమయాల్లో రహదారిపైకి వస్తే వెంటపడుతున్నాయని ప్రజలు ఆరోపించారు. సంబంధిత అధికారులు స్పందించి వీధి కుక్కల బెడద నుంచి రక్షించాలని ప్రజలు కోరుతున్నారు.