NLR: దగదర్తి మండల రెవెన్యూ అధికారి కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నేత మాలేపాటి సుబ్బానాయుడు విచ్చేశారు. ప్రజా సమస్యలపై అధికారులతో మాట్లాడడం జరిగింది. ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరించాలన్నారు. ముఖ్యంగా దగదర్తి మండలంలో వైసీపీ నాయకులు చేసినటు వంటి భూకబ్జాలపై తగిన చర్యలు తీసుకోవాలన్నారు.