VZM: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు తుది జాబితాను నెల్లిమర్ల తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ప్రదర్శన చేశారు. తహసీల్దార్ ఆదేశాల మేరకు ఎన్నికల విభాగం డిటి వివి ఆర్ జగన్నాథం నోటీసు బోర్డులో పెట్టారు. వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించనున్న ఎమ్మెల్సీ ఎన్నికల సంబంధించి ఓటరు నమోదుకు అందించిన దరఖాస్తులు మేరకు తుది ఓటరు జాబితా విడుదల చేసినట్లు చెప్పారు.