మాజీ ప్రధాని, దివంగత నేత మన్మోహన్ సింగ్కు భారతరత్న ప్రకటించాలనే డిమాండ్ తాజాగా తెరపైకి వచ్చింది. అయితే మన్మోహన్ను భారతరత్నతో సత్కరించాలని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ భావించారట. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన గొప్ప ఆర్థిక వేత్త అని 2013లోనే ప్రణబ్ ముఖర్జీ తన డైరీలో రాసుకున్నట్లు ఆయన కూతురు శరిష్ఠ ముఖర్జీ తాజాగా వెల్లడించారు.