leopard Surya Namaskar: అడవిలో చిరుతపులి సూర్య నమస్కారాలు!
ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ (Indian Forest Service-IFS) ఆఫీసర్ సుశాంత నంద ఆసక్తికర వీడియోలను పోస్ట్ చేస్తుంటారు. కొద్ది రోజుల క్రితం ఓ ఏనుగు తనంతట తానుగా పైపుతో స్నానం చేస్తున్న వీడియోను పోస్ట్ చేశారు.
ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ (Indian Forest Service-IFS) ఆఫీసర్ సుశాంత నంద ఆసక్తికర వీడియోలను పోస్ట్ చేస్తుంటారు. కొద్ది రోజుల క్రితం ఓ ఏనుగు తనంతట తానుగా పైపుతో స్నానం చేస్తున్న వీడియోను పోస్ట్ చేశారు. ఆ తర్వాత కూడా పలు వీడియోలను పోస్ట్ చేశారు. తాజాగా ఓ చిరుత పులి సూర్య నమస్కారాలు చేస్తున్నట్లుగా ఉన్న ఫోటోను షేర్ చేయడం అందరినీ ఆకట్టుకుంటోంది. సూర్య నమస్కారాలు యోగాలో భాగం. మనలో చాలామంది ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేస్తారు. అయితే ఓ చిరుత ఈ వ్యాయామం చేయడం ఆసక్తికరం.
ఈ వీడియోలో చిరుత మొదట తన ముందు ఎడమ కాలును ముందుకు చాపి, ఆ తర్వాత కుడి కాలును చాపి, బాడీని ముందుకు, వెనక్కి స్ట్రెచ్ చేస్తూ… మనం సూర్య నమస్కారాలు చేసినట్లుగా చేసింది. ఈ వీడియో పైన నెటిజన్లు సరదాగా స్పందించారు. యోగా టీచర్ లేకుండానే, యూట్యూబ్ లేకుండానే, బుక్స్ లేకుండానే… ఈ చిరుతకు యోగా ఎవరు నేర్పించారో అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. బాగుందని, సూపర్ అని, ఫిట్ నెస్ సీక్రెట్ అంటూ కామెంట్స్ పెట్టారు. సుశాంత నంద రెండు రోజుల క్రితం ఏనుగుల ట్విన్స్ కు సంబంధించిన వీడియో పోస్ట్ ను పెట్టారు. వారం క్రితం గుజరాత్ వీధుల్లో తిరుగుతున్న సింహాన్ని కొన్ని వీధి కుక్కలు కలిసి పరుగెత్తించిన వీడియోను పోస్ట్ చేశారు.