పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్ తన గగనతాళాన్ని మూసివేసింది. దీని కారణంగా పాక్ గగనతలం మీదుగా వెళ్లే విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ విషయంపై విమానయాన సంస్థలు ప్రయాణికులకు సరైన సమాచారం అందించాలని DGCI సూచించింది. పాక్ గగనతలం మీదుగా విమానాలు వెళ్ళకపోవడం వల్ల ప్రయాణ సమయం పెరగనుండటంతో అందుకు తగ్గట్లుగా విమానంలో క్యాటరింగ్ ఏర్పాట్లు చేయాలనీ పేర్కొంది.