తిరుపతికి చెందిన మయూర షుగర్స్ అధినేత జయరాం చౌధరిని ఈస్ట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కలకత్తాకు చెందిన ఓ సంస్థ.. తమను జయరాం మోసం చేశారని అక్కడి కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఉత్తర్వులు మేరకు ఈస్ట్ పోలీసులు ఆయన్ని చెన్నైలో అదుపులోకి తీసుకున్నారు. ఆయన కలకత్తా సంస్థకు దాదాపు రూ.8 కోట్లు మేర మోసం చేసినట్లు సమాచారం.