KMR: పట్టణానికి 33 / 11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ మంజూరు చేయడం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ తెలిపారు. పట్టణంలో విద్యుత్ సమస్య ఉండడంతో ప్రజలు తమ దృష్టికి తీసుకు వచ్చినట్లు వివరించారు. వెంటనే ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి మంజూరు చేయించడం జరిగిందన్నారు.