NZB: జిల్లా ఆర్టీసీ బస్టాండ్లో ఓ వృక్షం పూర్తిగా ఎండిపోయింది. తీవ్రంగా గాలి వీస్తే వృక్షం కింద పడి ప్రమాదం జరిగే వీలుంది. ఆర్టీసీ అధికారులు తక్షణమే వృక్షాన్ని తొలగించాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఈ విషయమై డి ఎం ఇంద్రను వివరణ కోరగా త్వరలోనే వృక్షమును తొలగించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.