»Alibaba Founder Jack Ma Seen In China After Long Absence
Jack Ma: ఏడాది తర్వాత చైనాలో అలీబాబా ఫౌండర్ ప్రత్యక్షం
దాదాపు గత మూడేళ్లుగా అరుదుగా బయట కనిపిస్తున్న అలీబాబా ఫౌండర్ జాక్ మా (Alibaba founder Jack Ma) తాజాగా చైనాలో (China) ప్రత్యక్షమయ్యాడు. చైనా హాంగ్జౌ లోని ఓ పాఠశాలలో (School in Hangzhou) అతను కనిపించినట్లుగా వార్తలు వచ్చాయి. 2020లో చైనా ఆర్థిక నియంత్రణ సంస్థల పైన ఆయన తీవ్ర విమర్శలు చేశాడు.
దాదాపు గత మూడేళ్లుగా అరుదుగా బయట కనిపిస్తున్న అలీబాబా ఫౌండర్ జాక్ మా (Alibaba founder Jack Ma) తాజాగా చైనాలో (China) ప్రత్యక్షమయ్యాడు. చైనా హాంగ్జౌ లోని ఓ పాఠశాలలో (School in Hangzhou) అతను కనిపించినట్లుగా వార్తలు వచ్చాయి. 2020లో చైనా ఆర్థిక నియంత్రణ సంస్థల పైన ఆయన తీవ్ర విమర్శలు చేశాడు. ఆ ప్రభావం అతని పైన కనిపించింది. పాలక వర్గం అతనిని టార్గెట్ చేసింది. అప్పటి నుండి అతను బహిరంగంగా తక్కువగా కనిపిస్తూ ఉన్నాడు. అలాగే, మూడేళ్లుగా అరుదుగా కనిపిస్తున్న అతను.. చైనాలో ఏడాదిన్నర తర్వాత ప్రత్యక్షమయ్యాడు. సౌత్ చైనా మార్నింగ్ (South China Morning Post) పోస్ట్ ప్రకారం… అతను విదేశాలలో ఒక ఏడాది కంటే ఎక్కువ కాలం ఉన్నాడు.. ఆ తర్వాత ఇటీవలే చైనాకు తిరిగి వచ్చాడు. ప్రభుత్వాన్ని విమర్శించిన అతను 2021 చివరలో చైనాను వీడాడు. ఇప్పుడు జాక్ మా రాకతో అలీబాబా (Alibaba) షేర్లు కూడా పుంజుకున్నాయి.
స్పెయిన్, నెదర్లాండ్స్, థాయ్ లాండ్, ఆస్ట్రేలియా, జపాన్ (Spain, the Netherlands, Thailand, Australia and Japan) వంటి దేశాల్లో అప్పుడుప్పుడూ ప్రత్యక్షమైన ఫోటోలు కనిపించాయి. కానీ ఏడాదికి పైగా చైనాలో (China) కనిపించలేదు. ఆరు నెలలుగా అతను జపాన్ లోని (Japan) టోక్యోలో (Tokyo) నివసిస్తున్నట్లు గత నవంబర్ నెలలో ఫైనాన్షియల్ టైమ్ పత్రిక తెలిపింది. హాంగ్జౌ నగరంలో ఆయన స్థాపించిన ఓ స్కూల్ కు వచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా వెలుగు చూశాయి. చైనా రావడానికి ముందు హాంకాంగ్ లో పర్యటించినట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తెలిపింది. చైనాలో రెండేళ్ల క్రితం వరకు అత్యంత ధనవంతుడు. ఈ ఏడాది జనవరిలో ఫైనాన్షియల్ టెక్నాలజీ దిగ్గజం యాంట్ గ్రూప్ (jack ma ant group) నియంత్రణను వదులుకున్నాడు.