ప్రకాశం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కంభం మండల రైతులు నిండా మునిగారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు 3000 ఎకరాలలో శనగ, 500 ఎకరాలలో మిర్చి, పొగాకు పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. అప్పుచేసి మరి పెట్టుబడి పెట్టామని రైతన్నలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోకపోతే తమకు ఆత్మహత్య శరణ్యమని వాపోతున్నారు.