ప్రధానిగా మన్మోహన్ సింగ్ అవిశ్రాంతంగా పనిచేసేవారు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న దేశాన్ని గట్టెక్కించి అభివృద్దిపథంలో పరుగులు పెట్టేలా చేసి ఆర్థిక సంస్కరణల రూపశిల్పిగా ప్రసిద్ధిగాంచారు. ఆయన హయాంలో అత్యధిక GDP(10.8) వృద్ధిరేటు నమోదైంది. మన్మోహన్ హయాంలోనే వెనుకబడిన వర్గాలకు 27శాతం సీట్లు కేటాయించారు. ప్రధాని పీఠాన్ని అధిష్టించిన తొలి హిందూయేతర వ్యక్తిగానూ రికార్డు సాధించారు.