నెల్లూరు: జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్, గ్రీన్ జాబ్స్ ప్రోగ్రాం ద్వారా సోలాల్ ప్యానల్ ఇన్స్టాలేషన్, ఎలక్ట్రికల్ సర్వీస్ టెక్నీషియన్స్లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు మేనేజర్ రాఘవేంద్రరావు తెలిపారు. ఐటీఐ, డిప్లొమా చదివిన వారు శిక్షణకు అర్హులన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.