AP: గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబుపై వైసీపీ నేతల దాడి ఘటనపై హోంమంత్రి అనిత సీరియస్ అయ్యారు. ఈ ఘటనను కూటమి ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని అన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. విధి నిర్వహణలో ఉన్న అధికారిపై దాడి చేయటం సరైంది కాదని తెలిపారు. వైసీపీ నేతలు అహంకారం, ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు.