కృష్ణా: కోడూరు మండల పరిధిలోని నక్కవానిదారిలో గురువారం రాత్రి దుండగులు వరికుప్పలు తగలబెట్టారు. కాగా శుక్రవారం మరోసారి గ్రామానికి చెందిన అప్పికట్ల నాంచారయ్య 2.5 ఎకరాల్లో ఉన్న వరికుప్పలను దుండగులు తగలపెట్టడం చర్చాంశనీయంగా మారింది. శనివారం ఉదయం నాంచారయ్య పొలం వెళ్లి చూసేసరికి చేతికి వచ్చిన పంట కళ్ల ముందు బూడిదై కనిపించడంతో నాంచారయ్య కుటుంబ సభ్యులు బాధపడుతున్నారు.