Akp: నాతవరం మండలం ములగపూడి పంచాయతీ డొంకాడ అగ్రహారం గ్రామంలో శనివారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రీ సర్వే డీటీ శివ రైతుల నుంచి అర్జీలు స్వీకరించారు. రీ సర్వే డీటీ మాట్లాడుతూ.. రైతుల భూసమస్యల పరిష్కారానికి ఈ రెవెన్యూ సదస్సులు ఉపయోగపడతాయన్నారు. భూసమస్యలు ఉ న్న రైతులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు.