KRNL: విశ్రాంత ఐఏఎస్ ఇంతియాజ్ వైసీపీకి రాజీనామా చేశారు. గత ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన మంత్రి టీజీ భరత్ చేతిలో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి పార్టీకి దూరంగా ఉన్న ఇంతియాజ్ తాజాగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.