ASR: డుంబ్రిగూడ గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థను శుభ్రం చేయించాలని స్థానికులు కోరుతున్నారు. గ్రామంలో డ్రైనేజీ చెత్తా చెదారంతోపాటు మురుగు నీరు నిల్వ ఉండిపోవడంతో దుర్గంధం వెదజల్లుతుందని దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మలేరియా, టైఫాయిడ్ వంటి పలు రోగాల బారిన పడే అవకాశాలు ఉన్నాయని ఆందోళన చెందుతున్నారు.