NLR: మనుబోలు మండల పరిధిలోని కొమ్మలపూడి క్రాస్ రోడ్డు సమీపంలోని వంతెనపై ఆటో బోల్తా పడటంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. మనుబోలు కోదండరామ పురానికి చెందిన శాంతి సేవ సంస్థ అధ్యక్షుడు ఆనంద్, ఆర్టీసీ డ్రైవర్ సంపత్ కుమార్ అన్నదమ్ములు. వీరు సొంత ఆటోలో నెల్లూరుకి పని మీద వెళ్లి తిరిగి సొంత ఊరికి వస్తుండగా కొమ్మలపూడి క్రాస్ రోడ్ సమీపంలోని ప్రమాదం జరిగింది.