ATP: గుత్తి పట్టణంలోని మన్రో సత్రం వద్ద ఈనెల 22న ఆదివారం రాత్రి బైక్ను ఆటో ఢీకొంది. ఈ రోడ్డు ప్రమాదంలో శ్రీరాములు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతనికి మెరుగైన చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. ఈ ఘటనపై మృతుడి బంధువుల ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు.