ELR: గణపవరం మండలం సరిపల్లె గ్రామంలో తాడేపల్లిగూడెం ఎక్సైజ్ సీఐ స్వరాజ్యలక్ష్మి ఆదేశాలతో ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ మురళీమోహన్ బుధవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అక్రమంగా మద్యం అమ్ముతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతని వద్ద 10 డ్యూటీ పెయిడ్ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసినట్లు సిఐ స్వరాజ్యలక్ష్మి తెలిపారు.