కడప: సిద్దవటం మండలంలోని కడప-చెన్నై జాతీయ రహదారి కనుమలోపల్లి సమీపంలోని మందగిరి శనీశ్వరుని ఆలయం వద్ద గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మోటార్ బైక్ను లారీ ఢీకొనడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.