కడప: 95వ బ్యాచ్, 11వ బెటాలియన్లో ఉద్యోగం చేస్తున్న రైల్వేకోడూరు మండలానికి చెందిన రాజయ్య సీఎం క్యాంప్ కార్యాలయానికి 15 రోజుల క్రితం డ్యూటీ నిమిత్తం తాడేపల్లికి వెళ్లారు. రెండు రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ ఉండగా గురువారం చికిత్స నిమిత్తం మణిపాల్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. వైద్యులు పరీక్షించి చనిపోయినట్టు ధ్రువీకరించారు.