భారత మహిళల క్రికెట్ జట్టు దూకుడు కొనసాగుతోంది. వెస్టిండీస్‌పై టీ20 సిరీస్ దక్కించుకున్న భారత్.. వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. వడోదరలో జరిగిన రెండో వన్డేలో భారత్ 115 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. వరుసగా రెండో మ్యాచ్ నెగ్గడంతో ఆఖరి వన్డే మిగిలి ఉండగానే 2-0తో సిరిస్ టీమిండియా సొంతమైంది. అయితే, శుక్రవారం జరిగే చివరి మ్యాచ్ నామమాత్రమే కానుంది.