ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీపై ఉత్కంఠ వీడింది. ఎట్టకేలకు ఐసీసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరి 23న దుబాయిలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. భారత్‌తో జరిగే మ్యాచ్‌లు అన్నీ దుబాయ్‌లోనే నిర్వహిచనున్నట్లు ఐసీసీ వెల్లడించింది. ఈ ట్రోఫీలో టీమిండియా ఫైనల్‌కు చేరుకుంటే ఫైనల్ మ్యాచ్ కూడా దుబాయ్‌లోనే నిర్వహిస్తారు.