KDP: రెవెన్యూ అధికారులు భూ సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా పరిష్కరించాలని రాష్ట్ర రవాణా యువజన క్రీడల శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. బోరెడ్డిగారిపల్లిలోని స్వగృహంలో మంగళవారం ప్రజా దర్బార్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. అన్నమయ్య జిల్లాలో ఎక్కువగా భూ సమస్యలు ఉన్నాయని, వీఆర్ నుండి తహసీల్దార్ వరకు గ్రామాలలో పర్యటించి భూ సమస్యలను పరిష్కరించాలన్నారు.