SKLM: జాతి స్థాయిలో ఇటీవల జరిగిన బాడీ బిల్డింగ్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన పాగోటి సతీష్‌కు కంబకాయ గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. సోమవారం సాయంత్రం స్వగ్రామానికి చేరుకున్న సతీష్‌ను ప్రాంతవాసులు స్వాగతించి నరసన్నపేట నుంచి కంబకాయ వరకు ఊరేగింపు చేపట్టారు. కార్యక్రమంలో సర్పంచి, మాజీ సర్పంచి తదితరులు పాల్గొన్నారు.