భారత మహిళల క్రికెట్ జట్టు మరో సవాల్‌కు సిద్ధమైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా విండీస్‌తో తలపడనుంది. ఇవాళ మధ్యాహ్నం 1:30 గంటలకు వడోదర వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. గాయంతో వెస్టిండీస్‌తో రెండు టీ20లకు దూరమైన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ వన్డే సిరీస్‌కు అందుబాటులోకి రానుంది. అలాగే, గత అయిదేళ్లలో సొంతగడ్డపై తొలిసారి సిరీస్ గెలిచిన టీమిండియా.. వన్డేల్లోనూ సత్తా చాటాలని చూస్తోంది.