NLG: ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి ఖోఖో జట్ల ఎంపిక పోటీలు ఈ నెల 22న దామరచర్లలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో నిర్వహించనున్నట్లు ఖోఖో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నాతి కృష్ణమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన క్రీడాకారులు ఆధార్ కార్డు ఒరిజినల్, జిరాక్స్ కాపీలతో ఉదయం 9 గంటలకు పాఠశాలలో ఖోఖో కోచ్ నాగేశ్వరరావుకు అందజేయాలన్నారు.