MBNR: ఉమ్మడి జిల్లాలోని గురుకులాలలో 5 వ తరగతి ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా పరీక్షల కన్వీనర్ వర్షిని శనివారం పేర్కొన్నారు. 2025-26 విద్యా ఏడాదికి 5 తరగతిలో ప్రవేశం కొరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ దరఖాస్తులు ఈనెల 21 నుండి ఫిబ్రవరి 1 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.