అంతర్జాతీయ క్రికెట్ కు రవిచంద్రన్ అశ్విన్ ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అశ్విన్, హర్భజన్ సింగ్ మధ్య విభేదాలున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అలాంటి వార్తలపై తాజాగా హర్భజన్ స్పందించారు. తన వ్యాఖ్యలను వక్రీకరించి పుకార్లు సృస్తిస్తున్నారని ఆరోపించారు. అశ్విన్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు.