ప్రకాశం: చినగంజాంలోని ఖాజీపాలెం కేవీఆర్ అండ్ ఎంకేఆర్ డిగ్రీ కళాశాల ఆవరణలో ఈ నెల 22 నుంచి జిల్లా క్రాస్ కంట్రీ ఛాంపియన్ షిప్ పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి మారుబోయిన వెంకటరెడ్డి తెలిపారు. పురుషుల, మహిళల 10 కిలోమీటర్లు పరుగుపందెం, అండర్-20 విభాగంలో బాలురకు, బాలికలకు 6 కిలోమీటర్లు పరుగు పందెం నిర్వహిస్తామని చెప్పారు.