ఎక్కువ మంది తమ పిల్లలకు చాలా విషయాలు నేర్పిస్తున్నా.. ఆధ్యాత్మిక అంశాలు, అలవాట్లపై అవగాహన కల్పించడం లేదు. పిల్లలు ఇతరులతో ప్రేమతో నడుచుకునేలా అలవాటు చేయాలి. ధ్యానం, ఇంద్రియాలపై నియంత్రణ వంటి అంశాలను నేర్పించాలి. పిల్లలు తప్పు చేసినప్పుడు క్షమాపణ చెప్పించాలి. ఎవరైనా బాధల్లో ఉన్నప్పుడు సానుభూతి చూపించడం అలవాటు చేయాలి.