అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అశ్విన్‌కు క్రికెటర్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, కపిల్ దేవ్ ఫోన్ చేసి విషెస్ చెప్పారని అశ్విన్ తెలిపారు. ఈ మేరకు కాల్ లిస్ట్ స్క్రీన్‌షాట్‌ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. తన రిటైర్మెంట్ రోజు ఇలా జరుగుతుందని 25 ఏళ్ల క్రితం ఎవరైనా చెబితే అప్పుడు తనకు హార్ట్ ఎటాక్ వచ్చేదని పేర్కొన్నారు.