తన తల్లిదండ్రులు మోనా కపూర్, బోనీకపూర్ విదాకులపై నటుడు అర్జున్ కపూర్ తాజాగా స్పందించాడు. తనకు పదేళ్ల వయసు ఉన్నప్పుడు వాళ్లిద్దరూ విడిపోయారని.. అది తననెంతో బాధించిందని అన్నాడు. నాన్న చేసిన పనికి ఆయన హ్యాపీగా ఉన్నంతకాలం తాను ఏవిధంగాను ఇబ్బందిపడనని చెప్పాడు. కాగా, మోనా కపూర్‌తో విడాకుల అనంతరం బోనీకపూర్ నటి శ్రీదేవిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.