పృథ్వీ షాను విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్లకు ఎంపిక చేయకపోవడంపై ముంబై క్రికెట్ అసోసియేషన్ స్పందించింది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 10 మంది ఫీల్డర్లతోనే ఆడామని పేర్కొంది. పృథ్వీ షా జట్టులో ఉన్న లేనట్లేనని తెలిపింది. బంతి పక్క నుంచి వెళుతున్న పృథ్వీ షా అందుకోలేడని ఎంసీఎ అధికారి వ్యాఖ్యానించారు.