ADB: ఆదిలాబాద్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నేడు (శుక్రవారం) టైక్వాండో, వూషూ, కిక్ బాక్సింగ్ జిల్లా స్థాయి ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు డీవైఎస్ఓ వెంకటేశ్వర్లు తెలిపారు. మండల స్థాయి పోటీల్లో అండర్ 14, 18 ముగించుకున్న వారు ఈ పోటీల్లో పాల్గొంటారన్నారు. క్రీడాకారులు ఉదయం 10 గంటలకు స్టేడియంలో సెక్రెటరీ అన్నారపు వీరేష్‌కు రిపోర్ట్ చేయాలన్నారు.