ఆసుపత్రి బిల్లులకు బయపడిన ఓ 24 ఏళ్ల యువకుడు బలవన్మరణం(suicide) చేసుకున్నాడు. ఈ విషాద ఘటన దేశ రాజధాని ఢిల్లీ(delhi)లో చోటుచేసుకుంది. అంతేకాదు అతను సూసైడ్ చేసుకునేందుకు గూగుల్‌లో(google) వెతికి నొప్పి లేకుండా ఎలా చనిపోవాలో అని తెలుసుకుని మృత్యువాత చెందాడు.
ప్రైవేటు ఆస్పత్రులు(private hospitals) రోజురోజుకు దారుణంగా తయారవుతున్నాయి. చికిత్స(treatment) కోసం ఆస్పత్రికి వస్తే డబ్బుల(money) దోపిడీయే లక్ష్యంగా తయారవుతున్నాయి. ఇంకొన్ని ఆస్పత్రుల్లో అయితే హెల్త్ ఇన్సూరెన్సులకు ట్రీట్ మెంట్ లేదని, ముందు డబ్బులు చెల్లించిన తర్వాతనే చికిత్స చేస్తామని చెబుతున్నారు. ఇంకోవైపు ఆక్సిజన్ అవసరం ఉన్న పేషంట్ల నుంచి మరింత డబ్బు లాగేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి క్రమంలో సాధారణ మధ్యతరగతి వ్యక్తి ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి చికిత్స చేయించుకుంటే అప్పులు చేయాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. ఆయా ప్రైవేటు ఆస్పత్రుల్లో దోపిడీపై పలువురు అనేక సార్లు ఆయా ప్రభుత్వాలకు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకునే వారు లేకుండా పోయారు. ఒక రోగి ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో వారం రోజులు ట్రీట్ మెంట్ తీసుకుంటే దాదాపు 10 లక్షల రూపాయల బిల్లు వేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది.
ఇటీవల హైదరాబాద్ లో ఇలాంటి సంఘటనలు వెలుగులోకి రాగా..తాజాగా ఇలాంటి సంఘటన దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో వెలుగులోకి వచ్చింది. ఆస్పత్రి బిల్లులకు బయపడి ఢిల్లీలో ఓ వ్యక్తి ఏకంగా సూసైడ్ చేసుకున్నాడు. 24 ఏళ్ల నితేష్ ఓ వ్యాధి చికిత్స కోసం(treatment) ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు. ఆ క్రమంలో తన వ్యాధి తగ్గకపోగా..అప్పటికే లక్షల రూపాయలు ఖర్చు అయ్యాయని అతను ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ నేపథ్యంలో తన తల్లిదండ్రులకు భారం కాకూడదని నిర్ణయించుకున్నాడు. అలాగే ఇంకా ఆస్పత్రిలోనే ఉంటే ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుందని భావించి అక్కడి నుంచి వెళ్లి ఓ హోటర్‌లో రూం తీసుకున్నాడు. ఆ క్రమంలో చనిపోవాలని అనుకున్నాడు.
అందుకోసం గూగుల్‌లో (google) కూడా సెర్చ్ చేశాడు. నొప్పి లేకుండా ఎలా ఆత్మహత్య(suicide) చేసుకోవాలని వెతికాడు. ఆ నేపథ్యంలో అతను వీడియోల ద్వారా మన శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ ఆక్సిజన్ తీసుకుంటే, హృదయ స్పందన మందగించి మృతి చెందే అవకాశం ఉందని తెలుసుకున్నాడు. అదే క్రమంలో ఆక్సిజన్ విషానికి దారితీస్తుందని వైద్యులు చెప్పినట్లు గమనించి ఆ మాదిరిగా ప్రయత్నం చేసి మృతి చెందాడు. ఆ క్రమంలో ఆక్సిజన్ సిలిండర్ తెచ్చుకుని శరీరమంతా ప్లాస్టిక్ కవర్‌తో చుట్టుకున్నాడు. అతని ముఖాన్ని కూడా కప్పి ఉంచి ఉన్న చిన్న ఆక్సిజన్ సిలిండర్‌కు కనెక్ట్ చేసుకుని బలవన్మరణం చెందాడు. ఈ ఘటన నార్త్ ఢిల్లీలోని ఆదర్శ నగారాలో హోటల్లో చోటుచేసుకుంది.
అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో నితీష్ సూసైడ్ చేసుకున్న ప్రాంతంలో డెత్ నోట్‌ను(death note) పోలీసులు(police) స్వాధీనం చేసుకున్నారు. ఆ లేఖలో తన వైద్యం కోసం ఇప్పటికే పేరెంట్స్ లక్షల రూపాయలు ఖర్చు చేశారని, ఇకపై తన తల్లిదండ్రులు(parents) తన కోసం అంత ఖర్చు పెట్టడం ఇష్టం లేదని లేఖలో స్పష్టం చేశాడు. అందుకే తన జీవితాన్ని ముగించుకుంటున్నట్లు పేర్కొన్నాడు. అది తెలిసిన అతని తల్లిదండ్రులు బోరున విలపించారు.