సంగారెడ్డి కలెక్టరేట్లోని ఇండోర్ మైదానంలో సీఎం కప్ క్రీడల్లో భాగంగా అండర్-19 మిక్స్డ్ డబుల్స్ బ్యాడ్మింటన్ విభాగంలో అక్షయ, ఖలీల్ గురువారం గోల్డ్ మెడల్ సాధించారు. రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా తరఫున ఎంపికయ్యారు. వీరిని కోచ్ శరత్ ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రస్థాయిలో కూడా విజయం సాధించాలని ఆకాంక్షించారు.